Header Banner

మళ్లీ మొదలైన కరోనా భయం.. భారత్ లో 257 యాక్టివ్‌ కరోనా కేసులు.. ఆ దేశాల్లో పెరుగుదల.!

  Wed May 21, 2025 12:38        India

దక్షిణాసియాలో కొవిడ్‌-19 మళ్లీ విజృంభిస్తోంది. భారత్‌లోనూ కరోనా వైరస్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో 257 యాక్టివ్‌ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అయితే, మరణాలు కూడా సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి మహారాష్ట్ర లో ఏకంగా వందకుపైగా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 6,066 స్వాబ్‌ టెస్ట్‌లు చేయగా 106 కేసులు పాజిటివ్‌గా తేలినట్లు చెప్పారు. అందులో కేవలం 101 మంది ముంబైకి చెందిన వారే ఉండటం గమనార్హం. మిగిలిన వారు థానే, పూణె, కొల్హాపూర్‌కు చెందిన వారుగా పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 52 పాజిటివ్‌ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. వీరిలో 16 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. జనవరి నుంచి రెండు కొవిడ్‌ సంబంధిత మరణాలు కూడా నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంగళవారం తెలిపింది. మరణించిన వారిలో ఒకరు క్యాన్సర్‌ రోగి అని పేర్కొంది.

 

ఇది కూడా చదవండి: ఏపీకి వర్ష సూచనలు! 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు.. ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు!

 

దేశంలో కొవిడ్‌ పరిస్థితి నియంత్రణలో ఉందని, ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు పరిస్థితిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. జలుబు, దగ్గుతో బాధపడుతున్న రోగులతోపాటు ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించిన రోగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని దవాఖానలను ఆదేశించింది.

ఆ దేశాల్లో పెరుగుదల..

సింగపూర్‌, చైనా, థాయ్‌లాండ్‌లో కొవిడ్‌ పెరుగుదల తీవ్రంగా ఉంది. ఏప్రిల్‌ చివరి వారంలో 11వేల కేసులు సింగపూర్‌లో నమోదుకాగా, మే మొదటి వారానికి ఆ సంఖ్య 14,000 దాటింది. హాంకాంగ్‌లో మే మొదటివారంలో 1000కిపైగా కొత్త కేసులు నమోదుకాగా, 33 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలోనూ కొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, ఫ్లూ లక్షణాలతో దవాఖానల్లో చేరే వారి సంఖ్య సాధారణం కంటే రెట్టింపు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఆసియా దేశాల్లో ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తికి జేఎన్‌.1, దాని సబ్‌వేరియంట్‌లే కారణమని అధికారులు చెబుతున్నారు. జేఎన్‌.1 ఉపరకాలైన ఎల్‌ఎఫ్‌.7, ఎన్‌బీ.1.8 వేరియంట్‌ల వ్యాప్తి ఎక్కువగా ఉన్నదని సింగపూర్‌ తెలిపింది.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే వార్త.. కొత్తగా కేబుల్ బ్రిడ్జ్! ఈ రూట్ లోనే ఫిక్స్ - ఆ నేషనల్ హైవేకు దగ్గరగా.!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

 

ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

నేడు (21/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!

 

నారా రోహిత్​పై కిడ్నాప్​ ఆరోపణలు! సీఎంకు కంప్లైంట్​ చేస్తానన్న మంచు మనోజ్!

 

శ్రీశైలం ఆలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్పై వేటు! ఘటన వెలుగులోకి రావడంతో..

 

బాంబు పేలుళ్ల కుట్ర భగ్నం..! వెలుగులోకి సంచలన విషయాలు!

 

ఏపీలో త్వరలోనే నంది అవార్డులు! సినిమాలతో పాటు నాటక రంగానికి..!

 

అమెరికా ప్రయాణికుల‌కు కీలక హెచ్చరిక! గడువు దాటితే తీవ్ర పరిణామాలు! శాశ్వత నిషేధం కూడా..

 

హర్భజన్ పై మండిపడుతున్న కోహ్లీ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో దుమారం!

 

గుల్జార్‌హౌస్‌ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స్పందించిన మోదీ, ఏపీ సీఎం! మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌!

 

ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపరాఫర్.. సర్కార్ కీలక నిర్ణయం! వాట్సాప్ ద్వారానే - అస్సలు మిస్ కాకండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #CoronaVirus #XECVariant #Germany #Europe